పెద్దపల్లి జిల్లా మల్లేపల్లిలో ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు బురదమయమవుతోందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా... పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. మహిళలు రోడ్డుపై వరినాట్లు వేశారు. వర్షాకాలం వస్తే రోడ్డు బురదమయమై... రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోందని మహిళలు వాపోయారు. ఇప్పటికైనా.. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.
రహదారిపై వరినాట్లు వేసిన మహిళలు
రోడ్డును బాగు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదు. దీంతో పెద్దపల్లి జిల్లా మల్లేపల్లిలో రోడ్డుపై మహిళలు వరినాట్లు వేశారు.
రహదారిపై వరినాట్లు వేసిన మహిళలు