గ్రామసభకు అధికారులు సకాలంలో హాజరుకాలేదని గ్రామస్థులు, రైతులు రాస్తారోకో నిర్వహించిన ఘటన పెద్దపల్లి జిల్లా నాగారంలో చోటుచేసుకుంది. గ్రామసభలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని పనులన్నీ వదిలి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని వాపోయారు. అధికారులు సమయానికి రాకపోవడం వల్ల విసిగిపోయిన గ్రామస్థులు, రైతులు మంథని- గోదావరిఖని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
గ్రామసభకు అధికారుల ఆలస్యం..గ్రామస్థులు, రైతుల ఆగ్రహం.. - నాగారం
పెద్దపల్లి జిల్లా నాగారంలో గ్రామస్థులు, రైతులు.. గ్రామసభను బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. అధికారులు సకాలంలో హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామస్థులు, రైతులు