మేడారం జాతర ఈ నెల 5 నుంచి 8 వరకు జరగనున్నందున... ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆర్టీసీ సేవలు అందించనున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు... రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గానూ... నేటి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల బస్సులను నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
మేడారం భక్తులకు ఆర్టీసీ సేవలు
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6వేల బస్సులు మేడారానికి నడపనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6 పాయింట్ల నుంచి 600 సర్వీలతో సేవలు అందించనున్నారు.
మేడారం భక్తులకు ఆర్టీసీ సేవలు
కరీంనగర్ జిల్లా నుంచి 600 సర్వీసులు సేవలందించనున్నాయి. కరీంనగర్ డిపో నుంచి 115, హుజూరాబాద్ నుంచి 45, గోదావరిఖని నుంచి 140, మంథని నుంచి 140, పెద్దపల్లి నుంచి 125, యైటింక్లయిన్ నుంచి 35 బస్సులు నడపనున్నారు. ఈ ఆరు పాయింట్లలో భక్తుల సౌకర్యార్థం విద్యుత్, మంచినీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంథని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు.
ఇదీ చూడండి:'భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే'