పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్పేటలో మత్స్య శాఖ అధికారులు 174 మంది మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందజేశారు. ముదిరాజ్, బెస్త కులస్థులకు ఇచ్చే సంక్షేమ పథకాలను పెద్దపెల్లి జిల్లా మత్స్య శాఖ డీఎఫ్వో మల్లేశం వివరించారు. మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం నమోదై ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల రూపాయలు అందుతాయన్నారు. సబ్సిడీపై వాహనాలు, చేపల పెంచడానికి అవసరమైతే చెరువులకు లోన్లు లభిస్తాయని చెప్పారు.
మత్స్యకారుల సభ్యత్వ కార్డుల పంపిణీ
పెద్దపల్లి జిల్లా బోయిన్పేటలో మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందించారు. 174 మందికి మత్స్యశాఖ అధికారులు ఈ కార్డులను ఇచ్చారు.
మత్స్యకారుల సభ్యత్వ కార్డుల పంపిణీ