పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెరాస నాయకులతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌కు మద్దతుగా చేసిన ఈ ర్యాలీని.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటెయ్యాలంటూ నినాదాలు చేశారు.
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెరాస బైక్ ర్యాలీ - trs
ప్రచారానికి చివరి రోజు కావడం వల్ల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని ముమ్మరం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌కు మద్దతుగా తెరాస కార్యకర్తలు, టీబీజీకేఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే చందర్