బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ సైన్స్‌కాంగ్రెస్ పోటీల్లో రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన బాలిక సత్తాచాటింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న హర్షిత తన ప్రదర్శనతో ఆలోచింపచేయడమే కాదు.. ఓ సమస్యకు పరిష్కారం చూపింది. శిరస్త్రాణానికి ఫ్యాన్లు బిగించి..వాటికి సెన్సార్ ఏర్పాటుతో ఓ వినూత్న ఆలోచనకు జీవం పోసింది.
ఆలోచన ఎలా వచ్చిందంటే...
వెల్డింగ్ పనిచేసే హర్షిత అంకుల్ పొగప్రభావంతో అనారోగ్యం పాలయ్యాడు. అతనికి వచ్చిన ఊపిరితిత్తుల సమస్య మరెవరికీ రాకుండా చేయాలనే ఆలోచన "కామన్‌మేన్ ఫ్రెండ్లీ మల్టీపుల్ హెల్మెట్" ప్రాజెక్టుకు జీవం పోసింది. ఈ పరికరం వల్ల వడ్రంగి, వెల్డింగ్ పనిచేసే వారికే కాదు... ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా పొలాల్లో వ్యవసాయం పనులు చేసుకునే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది.