తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక - ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక

గోదావరిఖనిలో ఈనెల 30న కేంద్రమంత్రుల సమక్షంలో... భారతీయ మజ్దూర్​ సంఘంలో చేరనున్నట్లు టీబీజీకేఎస్​ మాజీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ప్రకటించారు.

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక

By

Published : Sep 20, 2019, 8:17 PM IST

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవికి రాజీనామా చేసిన కెంగర్ల మల్లయ్య... ఈ నెల 30న భాజపా అనుబంధ భారతీయ మజ్దూర్​ సంఘంలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్మికుల మద్దతుతోనే బీఎంఎస్​లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతి బొగ్గుగనికి వెళ్లి భవిష్యత్​ కార్యచరణపై చర్చించి... ఈ నెల 30న గోదావరిఖనిలో కేంద్ర మంత్రులు, బీఎంఎస్​ నాయకుల సమక్షంలో సుమారు మూడువేల మందితో చేరనున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 30న బీఎంఎస్​లో బొగ్గుగని కార్మికుల చేరిక

ABOUT THE AUTHOR

...view details