ప్రజలను రక్షించాల్సిన పోలీసులు మద్యం మత్తులో తూలుతూ.. రోడ్డుపైనే పడుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. తాగిన వ్యక్తులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత మరిచి... ఏఎస్ఐ నాగయ్య మద్యం మత్తులో కనిపించాడు. రాత్రి 10 గంటల సమయంలో ఒళ్లు తెలియకుండా రోడ్డుపైనే పడుకున్నాడు. గమనించిన స్థానికులు ఆటోలో... కరీంనగర్లోని ఆయన ఇంటికి తరలించారు.
విధుల్లో ఉన్న సమయంలోనూ మద్యం తాగుతూ ఉంటాడని నాగయ్యపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించాలి కానీ.. ఇలా ఒళ్లు తెలియకుండా తాగి రోడ్డుపై పడుకోవడం వల్ల... డిపార్ట్మెంట్ పరువు ఏమవుతోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. పోలీసులే ఇలా చేస్తే.. ఇక పక్తు తాగుబోతుల పరిస్థితి ఏంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.