పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. గ్రామంలోని ఎస్సీ వాడలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎస్సీ కమిషన్ ఆఫీసుకే పరిమితం కాకుండా... సమస్య ఎక్కడ ఉంటే అక్కడికే కమిషన్ వస్తుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం: ఎర్రోళ్ల శ్రీనివాస్ - peddapalli district news
ఎస్సీ, ఎస్టీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎస్సీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం: ఎర్రోళ్ల శ్రీనివాస్
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు పట్టాలు కావడం లేదని వినతి పత్రాలు సమర్పించారు. ఎస్సీలకు సంబంధించిన భూ సమస్యలను త్వరితగతిన పూర్తిచేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి: సబితా