తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం పంప్‌హౌస్ పనులను సీఎం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అన్నీ గేట్లు మూసి వరద నీటిని నిల్వ చేయటం వల్ల కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇందులో భాగంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారం పంప్‌హౌస్‌ను సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అధికారులతో పంప్‌హౌస్‌లో కలియతిరిగి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన, పలువురు అధికారులు పాల్గొన్నారు.
అన్నారం పంప్‌హౌస్ వద్ద స్మితా సబర్వాల్ సందడి - అన్నారం పంప్‌హౌస్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంప్‌హౌస్ పనులను సీఎం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అధికారులతో పంప్‌హౌస్‌లో కలియతిరిగి పనులను పరిశీలించారు.
అన్నారం పంప్‌హౌస్ వద్ద స్మితా సబర్వాల్ సందడి