ఆసుపత్రిలో మంటలు... భయాందోళనలో రోగులు - ఆసుపత్రిలో మంటలు... భయాందోళనలో రోగులు
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ స్విచ్ బోర్డులో మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులను బయటకు పంపించేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున మొదటి అంతస్తులోని మెయిన్ వార్డులో విద్యుత్ స్విచ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను కిందికి తరలించారు. మంటలు చెలరేగడంతో పొగ అలుముకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్విచ్ బోర్డు పూర్తిగా కాలిపోయి కింద ఉన్న రోగుల మంచాలు కాలిపోయాయి. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.