తెలంగాణ

telangana

ETV Bharat / state

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం - SEXUAL

రెండ్రోజుల క్రితం పదేళ్ల  విద్యార్థినిపై అత్యాచారం యత్నానికి పాల్పడ్డాడో పాఠశాల అటెండర్. ఈ రోజు బడికి వెళ్లమంటే పాప ఏడుస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది.

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం

By

Published : Jun 24, 2019, 4:08 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండ్రోజుల క్రితం అటెండర్ పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ రోజు విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు పాఠశాలకు చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బడికెళ్లమంటే భయపడింది.. అడిగితే అసలు కథ చెప్పింది.

ఈ రోజు ఉదయం పాప బడికి వెళ్లమంటే నేను వెళ్లనంటూ మారాం చేసింది. ఏమైదంటూ తల్లి ఆరా తీస్తే అసలు విషయం చెప్పింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రామగుండం మండల విద్యాధికారి డానియల్ పాఠశాలకు చేరుకొని సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం

ఇవీ చూడండి: భాజపా ఆందోళనలో అపశృతి.. చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details