పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అమ్మవారి దేవాలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని ప్రాచీనమైన మహాలక్ష్మి, వాసవి కన్యకాపరమేశ్వరి, లలితాంబిక, సరస్వతీ మాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మహాలక్ష్మి దేవాలయంలో కలశస్థాపన చేసి.. తొమ్మిది రోజుల ఉత్సవాలలో భాగంగా నిరాటంకంగా కొనసాగే భజనపాళీ ప్రారంభించారు. దేవాలయం వెనక ఉన్న చెరువులోని కమలం పూలతో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులు పూజలు నిర్వహించడం విశేషం. భక్తులు అమ్మవారి మాలలను ధరించి దీక్షలు స్వీకరించారు.
మంథనిలో శరన్నవరాత్రి ఉత్సవాలు - శరన్నవరాత్రి ఉత్సవాలు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అమ్మవారి దేవాలయాలలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారి మాలలను ధరించి దీక్షలు స్వీకరించారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు