పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 41వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.
మంథనిలో ముక్కునేలకు రాస్తూ ఆర్టీసీ కార్మికుల నిరసన
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపారు. ఇక పై కేసీఆర్కు ఓటు వేయమంటూ నినాదాలు చేశారు.
మంథనిలో ముక్కునేలకు రాస్తూ ఆర్టీసీ కార్మికుల నిరసన
ప్రభుత్వం రోజుకో ప్రకటన చేయించడం వల్ల కార్మికులు మనోధైర్యం కోల్పోతున్నారని.. నిరాశకు గురైన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఇకపై ఆర్టీసీ కార్మికులెవరూ తెరాస పార్టీకి ఓటు వేయబోమంటూ ముక్కు నేలకు రాస్తూ వినూత్న నిరసన తెలిపారు.
ఇదీచూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా