తెలంగాణ

telangana

ETV Bharat / state

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి' - పెద్దపల్లి

క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని రామగుండం మండల విద్యాధికారి  డానియల్ పేర్కొన్నారు.

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి'

By

Published : Aug 21, 2019, 3:11 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసి జడ్పీహెచ్​ పాఠశాల క్రీడామైదానంలో మండల స్థాయి ఎస్​జీఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించారు. మండల విద్యాధికారి డానియల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారు.

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి'

ABOUT THE AUTHOR

...view details