రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా
13:50 August 03
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. రామగుండంలో వారం క్రితం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చందర్.. అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని చందర్ తెలిపారు. ప్రస్తుతం కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చందర్ కోరారు.