పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో పాఠశాలల క్రీడలను నిర్వహించారు. రామగుండం జోనల్ క్రీడాపోటీలను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వయంగా క్రీడాకారులతో కబడ్డీ ఆడారు. కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీల్లో మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డానియల్, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామగుండం జోనల్ క్రీడాపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే - క్రీడలను
అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న పీవీ సింధును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
రామగుండం జోనల్ క్రీడాపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే