తెలంగాణ

telangana

ETV Bharat / state

43వ వసంతంలోకి రామగుండం ఎన్టీపీసీ.. మహారత్నగా కీర్తి - NTPC RAMAGUNDAM COMPLETED 42 YEARS

దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 42 ఏళ్లు పూర్తిచేసుకొంది. మహారత్నగా కీర్తిగడించి.. నేడు 43 వసంతంలోకి అడుగుపెట్టింది. దక్షిణాది వెలుగురేఖ రామగుండం ఎన్టీపీసీపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

RAMAGUNDAM NTPC
43వ వసంతంలోకి రామగుండం ఎన్టీపీసీ.. మహారత్నగా కీర్తి

By

Published : Nov 14, 2020, 7:30 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీని రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో 1978 నవంబర్​ 14న అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ హయాంలో పునాదిరాయి పడింది. అంచలంచెలుగా ఏడు యూనిట్లకు విస్తరించింది. నేడు 2600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మహారత్న హోదాతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ప్రసిద్ది గాంచింది.

10 మెగావాట్ల సౌర విద్యుత్ అందిస్తోంది. 1600 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రం, రూ.450 కోట్లతో నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రం పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. రానున్న ఏడాదిలో సుమారు 3510 మెగావాట్ల సామర్థ్యాన్ని కూడగట్టుకొని.. దేశంలోనే అగ్రగామి సంస్థగా రామగుండం ఎన్టీపీసీ నిలవనుంది.

అవార్డులు-రివార్డులు

* దేశంలోనే ప్రథమ ఐఎస్​వో-14001 సర్టిఫికేట్ పొందిన ఏకైక సంస్థగా ఖ్యాతి గడించింది.

* ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్, గోల్డెన్ పికాక్ అవార్డులు పొందింది.

* 2019-2020 నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు వరించింది.

సామాజిక సేవలోనూ..

విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా కొనసాగుతూనే సామాజిక స్ఫూర్తి పథంలోనూ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 15 ఏళ్లుగా నిర్వాసిత గ్రామాల అభివృద్ధితో పాటు, విద్యారంగ వృద్ధికి విశేష కృషిచేస్తోంది. ప్లాంటు ఆవరణ సహా సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రామగుండం ఎన్టీపీసీ పరిసర గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రూ. 68 కోట్లు నిధులు కేటాయించి.. 50 పడకల నిర్మాణానికి పూనుకున్నాం. గత ఏడాది నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. 69 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పరిశ్రమ వ్యర్థాలను రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నాం.

-సునీల్ కుమార్ సీజీఎం ఎన్టీపీసీ రామగుండం.

43వ వసంతంలోకి రామగుండం ఎన్టీపీసీ.. మహారత్నగా కీర్తి

ఇవీచూడండి:ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details