ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు వరంగా సీఎంఆర్ఎఫ్ పథకం: ఎమ్మెల్యే కోరుకంటి - ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ వార్తలు

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్​.. చెక్కులను అందజేశారు. 31మందికి రూ. 8లక్షల 5వేల చెక్కులను పంపిణీ చేశారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్​ కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ramagundam mla korukanti chander, cmrf benefeciaries
రామగుండం ఎమ్మెల్యే, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు
author img

By

Published : Jan 17, 2021, 10:20 AM IST

రాష్ట్రంలో అనార్యోగంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ ద్వారా రూ. 8లక్షల 5వేల చెక్కులను ఎమ్మెల్యే చందర్ అందజేశారు.

సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని చందర్​ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలోను పథకాలను కొనసాగిస్తూ ప్రజలపై తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అనారోగ్య బాధితులకు రూ. 3 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సేవే పరమావధిగా భావిస్తూ.. ప్రజలకు అండగా, ఆసరాగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్​ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:భార్గవరామ్‌ బడిలోనే పథక రచన!

ABOUT THE AUTHOR

author-img

...view details