తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు: సీపీ సత్యనారాయణ

లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. ఉల్లంఘనలపై 600 కేసులు నమోదుచేశామన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ramagundam cp warning to citizens on false propaganda
తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు: సీపీ సత్యనారాయణ

By

Published : Apr 7, 2020, 5:58 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన 2200 మందిపై 600 కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. సుమారు 3500 వాహనాలు సీజ్​ చేశామన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన 90 శాతం మందిని స్వీయ గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి, నంది మేడారం, సుల్తానాబాద్​లో హౌస్ ఎలివేషన్ కేంద్రాల్లో 120 మంది ఉన్నారన్నారు. నిత్యవసర వస్తువులు, ఇతర అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీచూడండి:వాడిపోతున్న పూలు.. విలపిస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details