పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం కలవచర్ల రహదారిపై న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్య చేసిన దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వారి మృతదేహాలను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. వారిని ఏ కారణాలతో హత్య చేశారనే విషయమై విచారణ చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు.
నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదు: సీపీ సత్యనారాయణ - telangana varthalu
హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యపై రామగుండం సీపీ సత్యనారాయణ స్పందించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.
నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదు: సీపీ సత్యనారాయణ
సదరు న్యాయవాద దంపతులిద్దరు తమ సొంత గ్రామమైన గుంజపడుగులో ఒక దేవాలయం విషయంలో కొందరితో ఇటీవల గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ విషయమై హత్యకు గురైన సమయంలో న్యాయవాది వామనరావు ఒక వ్యక్తి పేరు చెప్పినట్టు వీడియోలు తమ వద్దకు వచ్చాయని వెల్లడించారు. ఇంకా ఏమైనా ఘటనలు ఉంటే వాటిపైనా విచారణ చేపట్టి నిందితులను శిక్షిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: హైకోర్టు న్యాయవాది దంపతులను నరికిచంపిన దుండగులు
Last Updated : Feb 17, 2021, 10:27 PM IST