పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని కాపాడిన పోలీసులకు సీపీ ఆధ్వర్యంలో రివార్డులు అందజేశారు. చదువులో వెనకబడి.. వేధింపులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే వారు ఒకసారి కుటుంబం గురించి ఆలోచించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు.
ఆత్మహత్యకు ముందు మీ కుటుంబాన్ని గర్తుతెచ్చుకోండి: సీపీ - రామగుండం కమిషనరేట్
ఒక కుటుంబాన్ని ఆత్మహత్య తీరని అగాధాల్లోకి తోస్తుందని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. గోదావరిఖనిలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిని కాపాడిన పోలీసు సిబ్బంది ప్రశంసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాహసించి నదిలో దూకి ప్రాణాలు కాపాడిన సిబ్బందికి రివార్డులు అందించారు.
ఆత్మహత్య.. కుటుంబంలో చీకటి నింపుతుంది : రామగుండం సీపీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వారిని కాపాడిన పోలీసు సిబ్బందికి ఆయన నగదు రివార్డులు అందజేశారు. గోదావరి నది పైనుంచి దూకి అత్మహత్యలకు పాల్పడుతున్న 50 మందిని కాపాడిన సిబ్బంది.. 50 కుటుంబాల్లో చీకట్లు నిండకుండా కాపాడారని ప్రశంసించారు. చిన్న చిన్న సమస్యలకు నిండు జీవితాలను బలి తీసుకోవద్దని.. మనసుకు నచ్చిన వారితో సమస్యలు పంచుకోవాలని సీపీ సూచించారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా