పెద్దపల్లి జిల్లాలో ఉన్న సాగు నీటిపారుదల, ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న నీటి పారుదల శాఖ, ఎస్సారెస్పీ కింద ఉన్న కాలువల మరమ్మతు పనులను ప్రతిపాదనల ప్రకారం ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
కాలువల మరమ్మతు పనులపై కలెక్టర్ సమీక్ష - lock down effect
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ సమీక్షాసమావేశం నిర్వహించారు. కాలువలు మరమ్మతు పనులు ఆగష్టు 10 లోపల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాలువల మరమ్మతు పనులపై కలెక్టర్ సమీక్ష
జిల్లాలో ఎస్సారెస్పీ డీ 83, డీ 86 కాలువల పనులు, ఎస్సారెస్పీ మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు, జిల్లాలో నీటిపారుదల శాఖ కింద ఉన్న కాల్వల పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల సరిహద్దులను గుర్తించాలని... దీని కోసం నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు కాలువల మరమ్మతులు పనితీరును పర్యవేక్షించాలని, కొవిడ్-19 వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.