ఆరో విడత హరితహారంలో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పోలీసు శాఖకు చెందిన స్థలంలో సిబ్బందితో కలిసి సీపీ సత్యనారాయణ మొక్కలు నాటారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి జిల్లాను నందనవనంగా తీర్చిదిద్దుతామని సీపీ పేర్కొన్నారు. అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా గౌడవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను సీపీ ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లాను నందనవనంగా తీర్చిదిద్దుతాం: సీపీ సత్యనారాయణ - 6th phase haritha haaram
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సత్యనారాయణ సిబ్బందితో కలిసి మూడు మొక్కలు నాటారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి జిల్లాను నందనవనంగా తీర్చిదిద్దుతామని సీపీ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లాను నందనవనంగా తీర్చిదిద్దుతాం: సీపీ సత్యనారాయణ
ప్రతీ ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని సీపీ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.