పెద్దపల్లి నియోజకవర్గంలో 15 మంది పోటీలో ఉండగా... కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, తెరాస అభ్యర్థిగా వెంకటేశ్ నేతకాని, భాజపా తరఫున సోగాల కుమార్ బరిలో ఉన్నారు. వీరు ముగ్గురూ లోక్సభకు కొత్తగా పోటీ చేసేవారే. అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.
పెద్దపల్లిలో గెలుపెవరిదో...? - పార్లమెంటు ఎన్నికలు
సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయి. తెరాస కొత్త అభ్యర్థిని బరిలో నిలపగా... హస్తం స్థానికేతరుడైన సీనియర్ నేతను పోటీకి దింపింది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో కాసేపట్లో తీర్పు రానుంది.
పెద్దపల్లిలో గెలుపెవరిదో...?