తెలంగాణ

telangana

ETV Bharat / state

మౌలిక వసతుల్లో అంతరాయం కలగదు: పెద్దపల్లి కలెక్టర్​

పెద్దపల్లి జిల్లా ప్రజలకు తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్​ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని పెద్దపల్లి జిల్లా పాలనాధికారి కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ తెలిపారు. సుల్తానాబాద్​ వార్డుల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు కేసీఆర్​ కిట్లు పంపిణీ చేశారు.

మౌలిక వసతుల్లో అంతరాయం కలగదు: పెద్దపల్లి కలెక్టర్​
మౌలిక వసతుల్లో అంతరాయం కలగదు: పెద్దపల్లి కలెక్టర్​

By

Published : Feb 27, 2020, 5:27 PM IST

ప్రజలకు మౌలిక వసతులైన తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు.

వార్డుల్లోకి వెళ్లి మౌలిక వసతులపై కలెక్టర్​ ఆరా తీశారు. ముందుగా మురికి కాలువలు పరిశీలించి విద్యుత్ తీగలు సవరించాలని కమిషనర్ శ్యాంసుందర్​ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వార్డులను సందర్శించారు. బాలింతలకు కేసీఆర్​ కిట్లు పంపిణీ చేశారు. రోగులకు మెరుగైన సదుపాయాలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

మౌలిక వసతుల్లో అంతరాయం కలగదు: పెద్దపల్లి కలెక్టర్​

ఇవీ చూడండి:ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ABOUT THE AUTHOR

...view details