తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద గోదావరి నదిపై పార్వతి బ్యారేజీ నిర్మించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు.పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాలను కలిపే వంతెన నేరస్థులు, హంతకులు, అసాంఘిక శక్తులు పారిపోయేందుకు వారధిగా తయారైంది. వంతెనపై, దాని పరిధిలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్రమార్కులకు ఈ వారధి ఒక వరంగా మారింది. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన వంతెన నేడు నేరస్థులు తప్పించుకునేందుకు రాచమార్గం అయింది. ఈ బ్యారేజీ నుంచి పెద్దపెల్లి జిల్లా గుంజపడుగు, సిరిపురం నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్, చెన్నూర్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే దూరం తగ్గింది.
హత్యచేసి బ్యారేజీ మీదుగానే..
రెండు నెలల కింద రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది దంపతులను నడిరోడ్డుపై హత్య చేసి అనంతరం కారులో ఈ పార్వతి బ్యారేజీ మీదుగా పారిపోయారు. వీరు పారిపోతూ హత్యకు వాడిన కత్తులను ఈ బ్యారేజీలోనే పడవేసి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయారు. గత నెల మార్చి 24న గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకొని, 3.10 కోట్ల సొత్తును అపహరించి ఈ మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు రెండు రోజుల క్రితం దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులకు ఈ బ్యారేజీ మీదుగా దొంగలు వెళ్లినట్లు అనుమానాలకు బలం చేకూరినట్లయింది.
దొంగలకు రాజమార్గంగా..