పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 1987-88 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రామగుండం నగరపాలక సంస్థలో పనిచేసే 150 మంది కార్మికులకు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేశ్ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచిన పూర్యవిద్యార్థులు - corona update
కరోనాను కట్టడి చేయటానికి నిరంతరం కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు దాతలు అండగా నిలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చదువుకున్న పూర్వ విద్యార్థులు రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తోన్న 150 పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచిన పూర్యవిద్యార్థులు
కరోనా కష్ట కాలంలో సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులను సీఐ రమేశ్ అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పూర్వ విద్యార్థులకు సూచించారు.