తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగిరిలోని పలు గ్రామాల్లో పర్యటించిన నూతన కలెక్టర్​ - పెద్దపల్లి జిల్లా తాజా వార్త

పెద్దపల్లి రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా నూతన కలెక్టర్​ సిక్త పట్నాయక్​ పర్యటించారు. గ్రామాల్లోని అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తయ్యాయో పరిశీలించారు.

new collector visit to several villages in peddapalli
రామగిరిలోని పలు గ్రామాల్లో పర్యటించిన నూతన కలెక్టర్​

By

Published : Feb 4, 2020, 3:25 PM IST

పెద్దపల్లి జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిక్త పట్నాయక్ పలు గ్రామాల్లో పర్యటించారు.

గతంలో పెద్దపల్లి జిల్లా పాలనాధికారిగా పనిచేసిన శ్రీ దేవసేన ఆధ్వర్యంలో పంచసూత్రాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అవార్డులు పొందిన రామగిరి మండలం ఆదివారం పేట గ్రామం, లంకె కేసారం గ్రామాల ప్రజలతో ముచ్చటించారు.

గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి మరుగుదొడ్లను, ప్రతి ఇంటికి వచ్చిన ఐదు రకాల మొక్కలను, కిచెన్ గార్డెన్​ను, ఇంకుడు గుంతలను నూతన కలెక్టర్ పరిశీలించారు. ఆ గ్రామాలకు ఎన్ని నిధులు మంజూరయ్యాయి.. ఆ నిధులతో ఎన్ని పనులు పూర్తయ్యాయనేది పరిశీలించడానికి వచ్చానని ఆమె తెలిపారు.

రామగిరిలోని పలు గ్రామాల్లో పర్యటించిన నూతన కలెక్టర్​

ఇదీ చూడండి: ఉద్యోగాల పేరుతో మహిళలకు వల..

ABOUT THE AUTHOR

...view details