కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మసీదులో ప్రార్థనల అనంతరం పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ బిల్లుకు తెరలేపినట్లు ఆరోపించారు.
ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో ఆందోళన
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముస్లిం, మైనార్టీ నేతలు... కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేశారు.
ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో ఆందోళన