వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పురపాలక సిబ్బంది ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దపల్లి పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 11 పీఆర్సీని అమలు చేసి ఒక్కో కార్మికుడికి కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచాలని పురపాలక సిబ్బంది ఆందోళన - పెద్దపెల్లి జిల్లా వార్తలు
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పురపాలక సిబ్బంది ఆందోళన నిర్వహించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
వేతనాలు పెంచాలని పురపాలక సిబ్బంది ఆందోళన
25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నట్లు వాపోయారు. ఫలితంగా కుటుంబ పోషణ భారమై ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పురపాలక కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్
TAGGED:
peddapally news