తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్​ పోయినా.. సెల్​ఫోన్ వెలుగుతో సరిపెట్టుకున్నారు.. - మున్సిపల్ బడ్జెట్

రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరుగుతుండగా.. విద్యుత్​కు అంతరాయం కలిగింది. ఇక చేసేదేమి లేక అధికారులు, నాయకులు చీకట్లోనే సెల్​ఫోన్​ వెలుగుతో సమావేశాన్ని కొనసాగించారు.

municipal-budget-meeting-in-dark-at-ramagundam
సమావేశంలో కరెంట్​ పోయినా.. సెల్​ఫోన్ వెలుగుతో సర్దిపెట్టుకున్నారు..

By

Published : Mar 30, 2021, 2:23 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో 2020-21 మున్సిపల్​ బడ్జెట్ సమావేశం జరుగుతోంది. మధ్యలో... విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో సెల్​ఫోన్​ లైట్లతో సమావేశాన్ని కొనసాగించారు. చీకట్లో బడ్జెట్ సమావేశం కొనసాగుతుండడంతో కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

సెల్​ఫోన్​ వెలుగులతో..

కరెంట్ వచ్చిన తరువాత సమావేశం కొనసాగించాలని నగర మేయర్​ అనిల్​ కుమార్​ను కోరారు. దీంతో కాసేపు సమావేశం నిలిచిపోయింది. అనంతరం కరెంట్ రావడంతో తిరిగి ప్రారంభమైంది.

విద్యుత్ ఉన్నప్పుడు..

ఇదీ చూడండి:అమెరికాలో కార్చిచ్చు- 400 ఇళ్లు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details