పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యశోద (45), రాహుల్ (18) నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదంలో తల్లీ కుమారుడు తీవ్ర గాయాలతో మృతి చెందారు.
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి - సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన వార్తలు
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకుమారుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.