వ్యవసాయ బావిలో మెుసలి పట్టివేత - crocodile
బావిలో పూడిక తీస్తున్న సమయంలో మెుసలి దర్శనమిచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లా లొంకెసారం గ్రామంలో చోటు చేసుకుంది. మెుసలిని రైతులు తాళ్లతో బంధించి అటవీ అధికారులకు అప్పజెప్పారు.
వ్యవసాయ బావిలో మెుసలి పట్టివేత
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంకెసారం గ్రామంలో చెరువుగట్టు దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో రైతులు పూడిక తీస్తున్న సమయంలో 4అడుగులు గల మెుసలి కనబడింది. వెంటనే రైతులు చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చి తాళ్లతో బంధించి పైకి లాగి వేశారు. గత సంవత్సర కాలం నుంచి అప్పుడప్పుడు చెరువులో కనిపించేదని, ఎండాకాలం సందర్భంగా చెరువు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఆహారం కోసం బావిలోకి వచ్చినట్టు రైతులు అనుమానిస్తున్నారు. మెుసలిని అటవీ అధికారులకు అప్పజెప్పారు.