తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆది వరాహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండల కేంద్రంలోని ఆది వరాహస్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

mlc kavitha visited adivarahaswamy temple at kamanpur in peddapalli district
ఆది వరాహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

By

Published : Dec 27, 2020, 2:42 PM IST

ఎంతో మహిమ గల అతి ప్రాచీనమైన ఆది వరాహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండల కేంద్రంలోని ఆది వరాహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

పూజ అనంతరం దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ కవితకు శాలువా కప్పి స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని దేవాలయ ఈవో మారుతీరావుపై స్థానిక సర్పంచ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నిలకడగా రజనీకాంత్​ ఆరోగ్యం.. రిపోర్టులన్నీ నార్మల్

ABOUT THE AUTHOR

...view details