రైతుల కళ్లల్లో ఆనందం నింపిన మహానేత సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని లింగాపూర్, రాయదండి, పెద్దంపేట్, టీటీఎస్ అంతర్గాం, గోలివాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
'రైతు కళ్లల్లో ఆనందం నింపిన నేత కేసీఆర్' - ramagundam mla
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు.
'రైతు కళ్లల్లో ఆనందం నింపిన మహానేత కేసీఆర్'
రైతులను రాజులుగా మార్చాలన్న ముఖ్యమంత్రి కల సాకారం అయ్యిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈసారి పంటలు సమృద్ధిగా పండి అధిక దిగుబడులు రావడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.