ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీ లక్ష్మీ ఫంక్షన్హాల్లో విజయమ్మ ఫౌండేషన్, గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేద ముస్లింలకు నిత్యవసరాలు, బియ్యం పంపిణీ చేశారు. ముస్లింలు రంజాన్ మాసంను పవిత్రంగా భావిస్తారని, ఉపవాసాలు, ప్రార్థనలతో ఎంతో ఘనంగా రంజాన్ పండుగను జరుపుకుంటారని అన్నారు.
ముస్లింలకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - corona virus update news
రంజాన్ పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముస్లింలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముస్లింలు ఇళ్లవద్దనే ప్రార్థనలు చేసుకోవాలని ఎమ్మల్యే సూచించారు.

ముస్లింలకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కరోనా మహమ్మరి రంజాన్ పండుగకు అడ్డంకిగా మారిందన్నారు. ముస్లింలు ఇళ్లవద్దనే ప్రార్థనలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తెల్లరేషన్ కార్డుదారులకు 12కేజీల బియ్యంతో పాటు 1500 రూపాయల నగదు అందించారని తెలిపారు.
ఇవీ చూడండి: 'కరోనా కేసుల్లానే పార్టీ ఫిరాయింపులు: రేవంత్రెడ్డి'