పెద్దపెల్లి జిల్లా మంథని గౌతమేశ్వర స్వామివారి ప్రాంగణంలో గోదావరి నదికి సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లప్పుడూ గోదావరిలో జలకళతో కళకళలాడుతుందని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు - minister
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు మంథని చేరుకోవడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదారమ్మకు పసుపు, కుంకుమలతో సారే సమర్పించారు.
గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు