పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం శంకుస్థాపన చేశారు. పనులను వేగవంతంగా పూర్తిచేయడమే కాకుండా నాణ్యత పాటించాలన్నారు. మొదటి విడతలో పెద్దపల్లి నుంచి మంథని వరకు, రెండవ విడతలో మంథని నుంచి కాటారం వరకు మరమ్మతులు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్, పెద్దపెల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా జేసి వనజా దేవి. వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
రహదారి మరమ్మత్తులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన - minister
పెద్దపల్లి నుంచి కాటారం వరకు రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రహదారి మరమ్మత్తులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన