పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమారిపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై.. ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దళిత వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి కొప్పుల - peddapalli district latest news
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనకు యువత పాటుపడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి జిల్లా భీమారిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
దళిత వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి కొప్పుల
ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీపీ కూనారపు రేణుకా దేవి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని