పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరంకంటి చందర్ పాల్గొన్నారు. కేకు కోసి వేడుకలు నిర్వహించారు. సింగరేణిలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
బొగ్గు కార్మికుల సమక్షంలో మంత్రి పుట్టిన రోజు వేడుకలు - eshwar
మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను సింగరేణి బొగ్గు కార్మికులు జరుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని కేక్ కట్ చేశారు.
మంత్రి పుట్టిన రోజు వేడుకలు