లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ మద్దతు పలుకుతోందని మందకృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో సగానికి పైగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు కాదన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు.
'కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి సోనియా రుణం తీర్చుకుందాం' - peddapalli
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన వారికే ఓటేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్‌కు మద్దతుగా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్‌కే మా మద్దతు