పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డి పల్లికి చెందిన ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న దండన సాగర్(23), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంట్లో వారి ప్రేమను ఒప్పుకోరనే భయంతో గురువారం సాయంత్రం గోదావరిఖని బస్టాండ్లో పురుగుల మందు సేవించారు. అక్కడి నుంచి మంథనికి చేరుకున్నారు. మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు చేరుకొని మందు తాగిన విషయాన్ని బంధువులకు తెలియజేశారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గోదావరిఖనిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం - ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయంతో పురుగుల మందు సేవించారు ఇద్దరు ప్రేమికులు. అనంతరం వేరే ఊరు చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు.
Lovers suicide attempt at Godavarikhani
Last Updated : Jul 19, 2019, 7:42 AM IST
TAGGED:
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం