పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో లాక్డౌన్ అమలు తీరును రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఉదయం 10 గంటల తర్వాత నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు మోహరించారని సీపీ తెలిపారు.
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ఉద్యోగులు, కార్మికులు గుర్తింపు కార్డును వెంట ఉంచుకుని విధులకు వెళ్లాలని సూచించారు.
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
2వేల మంది సిబ్బందితో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 20 బృందాలతో లాక్డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో విధులు నిర్వహించే కార్మికులు, ఉద్యోగులు గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. లాక్డౌన్ అమలుతో పారిశ్రామిక ప్రాంతంలోని రోడ్లు బోసి పోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కరోనా సోకిన వారు అధైర్య పడకుండా డాక్టర్ల సూచనలు పాటిస్తూ మహమ్మారిని జయించాలని సీపీ ధైర్యం చెప్పారు.
Last Updated : May 13, 2021, 9:20 PM IST