తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - కృష్ణ, గోపిక వేషధారణ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పారిశ్రామిక వాడలో కృష్ణ, గోపిక వేషధారణలలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Aug 23, 2019, 4:29 PM IST

గోదావరిఖనిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోదావరిఖని యాదవ సంఘం కార్యాలయంలో శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణ, గోపిక వేషధారణలో చిన్నారుల ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు ఉట్టి కొట్టడంలొ ఒకరికి ఒకరు పోటీ పడ్డారు. అలాగే శ్రీ శారద శిశు మందిర్​ పాఠశాలలో శ్రీకృష్ణ భక్తి గీతాలతో పాటు చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వివిధ కూడళ్లలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details