సేవలకు మరో పేరు నర్సులు... వారి సేవా దృక్పథం అమోఘమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని.. వైద్య సిబ్బందిపై పూలు చల్లారు. అనంతరం కేక్ కోసి వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో నర్సులను శాలువలతో ఘనంగా సన్మానించారు.
నర్సుల సేవాదృక్పథం అమోఘం: ఎమ్మెల్యే చందర్ - corona virus
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని నర్సులను సన్మానించారు. కరోనా నేపథ్యంలో నర్సుల సేవాదృక్పథం అమోఘమని కొనియాడారు.
నర్సుల సేవాదృక్పథం అమోఘం: ఎమ్మెల్యే చందర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజ సేవకు అంకితమైన సేవామూర్తులు నర్సులని ఆయన ప్రశంసించారు.
ఇవీ చూడండి:'ఓట్ల కోసమే జగన్తో కేసీఆర్ దోస్తీ'