తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా హిజ్రాల 'జల్సా' మహోత్సవం - latest news of trans genders jalsa event

హిజ్రాలను చులకనగా చూడంకుండా సమాజంలో తోటి వ్యక్తులుగా ఆదిరించాలని ట్రాన్స్​జెండర్ల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాష్ట్రస్థాయి జల్సా మహోత్సవాన్ని ఆటపాటలతో వైభవంగా జరుపుకున్నారు.

హిజ్రాల 'జల్సా' మహోత్సవం

By

Published : Nov 11, 2019, 1:49 PM IST

ట్రాన్స్​జెండర్లను చులకనగా చూడకుండా, సమాజంలో తోటి వ్యక్తులుగా ఆదరించాలని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా అన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం పట్టణంలో రాష్ట్రస్థాయి జల్సా మహోత్సవాన్ని హిజ్రాలు వైభవంగా నిర్వహించుకున్నారు. 33 జిల్లాలోని హిజ్రాలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

సంఘంలో నూతనంగా చేరిన ఓ వ్యక్తికి శారీ ఫంక్షన్, వివాహ వేడుకలను నిర్వహించారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. భవిష్యత్తులో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలతో సత్ప్రవర్తనతో ఎలా ఉండాలో అందరూ చర్చించుకున్నారు.

జల్సా మహోత్సవంలో హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.

హిజ్రాల 'జల్సా' మహోత్సవం

ఇదీ చూడండి: తెరాస సభ్యత్వం తీసుకున్న 200మంది హిజ్రాలు

ABOUT THE AUTHOR

...view details