గ్రామాభివృద్ధితోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని పెద్దపల్లి జిల్లా పాలనాధికారి దేవసేన స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గంలో క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. నీటి పొదుపు, ఇంకుడు గుంతలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయడం వల్ల పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్లో దక్షిణ భారత దేశంలో మొదటి స్థానాన్ని, జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచామని తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు గర్వంగా వుందని... అదే స్పూర్తితో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని దేవసేన కోరారు.
"గ్రామాభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం"
మంథనిలో క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా పాలనాధికారి దేవసేన పాల్గొన్నారు. నీటి పొదుపు, ఇంకుడు గుంతలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.
"గ్రామాభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం"