పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అటెండర్‌గా పనిచేసే రాచమల్ల రాజమౌళి అప్పుల బాధతో బాధపడుతున్నాడు. భరించలేక గోదావరిఖనిలోని గోదావరి నది వంతెన మీద నుంచి దూకాడు. బతుకుపై ఆశ పుట్టి నదిలోని పిల్లర్ పట్టుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అటువైపు వచ్చిన పోలీసు వాహనదారులు సమాచారం తెలుసుకున్నారు. గోదావరిఖని రెండో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు, ఒకటో పట్టణ సీఐ పరస రమేష్, ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు గోదావరిఖని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రాజమౌళిని మత్య్సకారుల పడవల సాయంతో కాపాడారు.
నదిలో దూకాడు.. కాపాడాలని ఆర్తనాదాలు చేశాడు... - గోదావరిఖని
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందామని గోదావరిఖనిలోని గోదావరినదిలో దూకాడు. కానీ మళ్లీ బతుకు మీద ఆశ పుట్టింది. నదిలోని పిల్లర్ పట్టుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు.
నదిలో దూకాడు.. కాపాడాలనీ అర్థ నాదాలు చేశాడు
అనంతరం అతని కుటుంబ సభ్యులు నది వద్దకు వచ్చారు. బయటపడిన రాజమౌళిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు.
ఇదీ చూడండి : మరణ వాంగ్మూలం రాసి ఒప్పంద ఉద్యోగి అదృశ్యం