వాహనాల పార్కింగ్ ఇబ్బందులను అదిగమించేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక దుకాణాల సముదాయ కాంప్లెక్స్ సెల్లార్లో కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని దుకాణాల యజమానులు, గుమస్తాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు తయారుచేసిన ఫ్లెక్సీని సీపీ సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతంరం శిరస్త్రాణం ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు.
రామగుండంలో ఉచిత పార్కింగ్ ప్రారంభం - free parking fecility
రామగుండం నగరపాలక దుకాణాల సముదాయం సెల్లార్లో ఉచిత పార్కింగ్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు.
రామగుండంలో ఉచిత పార్కింగ్ ప్రారంభం